Top 10 Iconic Movies of the Bollywood King | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నేడు తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు ఇండియాలో ఉన్న సినీ ప్రముఖులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు షారుఖ్. అయితే షారుఖ్ బర్త్‌డే సందర్భంగా అతడిని స్టార్‌గా నిలబెట్టిన 10 ఐకానిక్ సినిమాలు చూద్దాం.
1. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే (Dilwale Dulhania Le Jayenge – 1995)

DDLJ | దిగ్గజ దర్శకుడు యష్ చోప్రా నిర్మాణంలో అతడి కొడుకు ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన చిత్రం దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. అప్పటివరకు సాధారణ నటుడిగా ఉన్న షారుఖ్‌ని ఈ చిత్రం ఒక్కసారిగా స్టార్‌గా మార్చింది. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఐకానిక్‌గా నిలవడమే కాకుండా ముంబైలోని మరాఠ మందీర్ థియేటర్లో దాదాపు 30 ఏండ్ల నుంచి ప్రదర్శితమవుతు వస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదికలు యూట్యూబ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
2. కుచ్ కుచ్ హోతా హై (Kuch Kuch Hota Hai – 1998):

Kuch Kuch Hota Hai
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కరణ్ జోహార్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం కుచ్ కుచ్ హోతా హై. అప్పటివరకు ఉన్న బాలీవుడ్ రొమాన్స్ చిత్రాలను పక్కనపెట్టి కొత్త ట్రెండ్‌ను సృష్టించింది ఈ చిత్రం. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
3.దిల్ సే (Dil Se.. – 1998)

Dil Se
దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షారుఖ్ కెరీర్లో ఐకానిక్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలోని ఛయ్యా ఛయ్యా పాట అయితే ఇప్పటికి ప్రేక్షకులు వింటున్నారు అనడంలో సందేహం లేదు.
4. బాజీగర్ (Baazigar – 1993)

Baazigar Srk
షారుఖ్ ఖాన్ నటించిన మొట్టమొదటి యాంటీ-హీరో పాత్ర చిత్రం ఇది. ఇందులో విలన్‌గా నటించిన కూడా ఆయనకు ఉత్తమ నటుడిగా తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ చిత్రం కూడా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదికలు యూట్యూబ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
5. వీర్ జారా (Veer-Zaara – 2004)

Veer Zaara Srk
షారుఖ్ – యష్ చోప్రా కాంబినేషన్లో వచ్చిన ఐకానిక్ సినిమాలలో ఒకటి వీర్ జారా. ఇందులో భారత సైనికుడి పాత్ర పోషించిన షారుఖ్ పాకిస్థాన్ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే తన కోసం పాకిస్థాన్‌కి వెళ్లిన షారుఖ్‌కి అక్కడ అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అయితే వాటిని ఎదురుకొని షారుఖ్ ఇండియాకి ఎలా తిరిగి వచ్చాడు అనేది ఈ సినిమా కథ. ఈ చిత్రం 2004లో అత్యధికంగా ప్రేక్షకులను అలరించిన చిత్రంగా రికార్డును అందుకోవడమే కాకుండా.. ఇండియా – పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలకు దారి వేసింది. ఈ చిత్రం కూడా ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతంది.
6. స్వదేశ్ (Swades – 2004)

Swades
షారుఖ్ నటించిన ఐకానిక్ సినిమాలలో మరో చిత్రం స్వదేశ్. లాగాన్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారతీయ పరిస్థితులను ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. మోహన్ భార్గవ (షారుఖ్) అనే నాసా శాస్త్రవేత్త ఇండియాను వదిలి వెళ్లి అమెరికాలో పనిచేస్తుంటాడు. అయితే తనను చిన్నప్పుడు పెంచిన కావేరి అమ్మను అమెరికా తీసుకువెళ్లడానికి ఇండియాకు వస్తాడు షారుఖ్. ఇండియాకు వచ్చిన షారుఖ్ అక్కడి గ్రామల్లో ఉన్న నిరక్షరాస్యత, పేదరికం, పాతకాలపు కట్టుబాట్లు, విద్యుత్ లేకపోవడం వంటి సమస్యలు చూసి చలించిపోతాడు. దీంతో తన ఉన్నత విద్య, విజ్ఞానం దేశం కోసం ఉపయోగపడాలని అంతర్మథనం చెందుతాడు. ఈ క్రమంలోనే అమెరికా తిరిగి వెళ్లిన షారుఖ్‌కి తన దేశం గుర్తుకురావడం.. దేశానికి ఏదో చేయాలనే తపన అతడిని వెంటాడుతాయి. దీంతో తన NASA ఉద్యోగాన్ని వదులుకొని, స్వదేశానికి తిరిగి రావడం ఈ సినిమా కథ. షారుఖ్ అత్యుత్తమ నటనల్లో ఒకటిగా ఈ సినిమా పరిగణించబడుతుంది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
7. చక్ దే! ఇండియా (Chak De! India – 2007)

Chak De India
షారుక్ కెరీర్లో మరో మైలురాయి చిత్రం చక్ దే! ఇండియా దేశభక్తి, క్రీడా నేపథ్యంతో కూడిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం కూడా నెట్ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
8. కభీ ఖుషీ కభీ గమ్ (Kabhi Khushi Kabhie Gham – 2001):

Kabhi Kushi Kabhi Gum
షారుక్ ఖాన్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, జయ బచ్చన్, కరీనా కపూర్, కాజోల్ నటించిన భారీ మల్టీ-స్టారర్ డ్రామా కభీ ఖుషీ కభీ గమ్. 2001లో వచ్చిన ఈ సినిమాకు కరణ్ జోహార్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
9 . దేవదాస్ (Devdas – 2002)

Devdas
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన షారుఖ్ ఐకానిక్ చిత్రం దేవదాస్. శరత్ చంద్ర ఛటర్జీ నవల ఆధారంగా వచ్చిన ఈ సినిమా షారుఖ్ కెరీర్లో క్లాసిక్‌గా నిలిచిపోయిందిజ.
10. మై నేమ్ ఈజ్ ఖాన్ (My Name Is Khan 2010)

My Name Is Khan
షారుఖ్ కెరీర్లో నిలిచిపోయే చిత్రాలలో మరో చిత్రం మై నేమ్ ఈజ్ ఖాన్. కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2010లో బ్లాక్ బస్టర్ అందుకుంది. 9/11 అటాక్ తర్వాత అమెరికాలో ఉన్న ముస్లింలపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మా దేశం నుంచి మీరు వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున్న నిరసనలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని.. ఈ చిత్రం తెరకెక్కించాడు కరణ్ జోహార్. ఈ చిత్రం ప్రస్తుతం ఏ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అందుబాటులో లేదు.
ఇవే కాకుండా..
డర్ 1993
కల్ హో నా హో
దిల్ తో పాగల్ హై
ఓం శాంతి ఓం
చైన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రాలు షారుఖ్ కెరీర్లో సూపర్ హిట్లుగా నిలిచాయి.