Shah Rukh Khan | వరల్డ్‌వైడ్‌గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న భారతీయ నటుల్లో టాప్‌లో ఉంటాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan). ఓ వైపు సినిమాలతో అభిమానులకు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు సామాజిక సేవలో కూడా తనవంతు పాత్ర పోషిస్తాడు. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటాడు. ఈ స్టార్ హీరో పాపులర్ మోటార్ బ్రాండ్ Hyundai ఈవెంట్లో సందడి చేశాడు.
Hyundai కంపెనీ వికలాంగుల కోసం డిజైన్ చేసిన కొత్త మోడల్ Samarth లాంఛింగ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్లో పారా ఒలింపియన్స్ కోసం రాసిన ఓ పద్యాన్ని చదివి.. వారిలో మరింత ఉత్తేజాన్ని నింపాడు బాద్షా. తన వాకింగ్ స్టైల్‌తో ఈవెంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు షారుఖ్‌ఖాన్. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది జవాన్‌తో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసిన షారుఖ్‌ఖాన్ ప్రస్తుతం డంకీ (Dunki) సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. డంకీ నుంచి Dunki Drop 2 రూపంలో Lutt Putt Gaya సాంగ్‌ను రేపు విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ.. సాంగ్ లుక్ కూడా విడుదల చేశారు. రొమాంటిక్ ట్రాక్‌తో ఫన్ మెలోడీగా ఈ పాట ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. డంకీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటరల్లో విడుదల కానుంది.
ఈవెంట్లో షారుఖ్‌ఖాన్ సందడి..
King Khan at the Hyundai event today#ShahRukhKhan #Hyundai @iamsrk pic.twitter.com/33ktYcnOGV
— ♡♔SRKCFC♔♡™ (@SRKCHENNAIFC) November 21, 2023
KING @iamsrk unveils Hyundai’s initiative for specially disabled people in an event 🥹✨#ShahRukhKhan pic.twitter.com/I5iuHwsSso
— SRK Fans Trends (@_SRKFansTrends) November 21, 2023