క్రేజీ మల్టీస్టారర్‌కి రంగం సిద్ధం?
తమిళ ప్రజల ఆరాధ్యనటులు అనగానే గర్తొచ్చే పేర్లు రజనీకాంత్, కమల్‌హాసన్. అప్పుడెప్పుడో కెరీర్ ప్రారంభంలో వీరిద్దరూ కలిసి ఓ అరడజను సినిమాల్లో నటించారు. తర్వాతకాలంలో ఇద్దరికీ సూపర్స్టార్డమ్ రావడంతో.. వారిద్దరినీ భరించి సినిమాలు చేయడం నిర్మాతలకు భారమైపోయింది.
తమిళ ప్రజల ఆరాధ్యనటులు అనగానే గర్తొచ్చే పేర్లు రజనీకాంత్, కమల్‌హాసన్. అప్పుడెప్పుడో కెరీర్ ప్రారంభంలో వీరిద్దరూ కలిసి ఓ అరడజను సినిమాల్లో నటించారు. తర్వాతకాలంలో ఇద్దరికీ సూపర్స్టార్డమ్ రావడంతో.. వారిద్దరినీ భరించి సినిమాలు చేయడం నిర్మాతలకు భారమైపోయింది. దాంతో ఈ మిత్రులిద్దర్నీ ఒకే స్క్రీన్‌పై చూసే అదృష్టం ఆడియన్స్‌కి దూరమైపోయింది. 1985లో వచ్చిన హిందీ సినిమా ‘గెరఫ్తార్’ వారిద్దరూ కలిసి నటించిన చివరి సినిమా.
మళ్లీ 40ఏండ్ల తర్వాత వీరిరువురూ కలిసి నటించేందుకు రంగం సిద్ధమైంది. ఈచిత్ర నిర్మాతల్లో కమల్‌హాసన్ కూడా ఒకరు కావడం విశేషం. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకుడు. త్వరలో ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుంది. ఇదిలావుంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. ఈ క్రేజీ మల్టీస్టారర్ కోసం చెన్నై ప్రసాద్ స్టూడియోలో ఓ భారీ సెట్ వేశారనీ, ఈ సెట్లోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో షూట్ శనివారం మొదలైందని ఈ వార్త సారాంశం.
ప్రముఖ కెమెరామేన్ రాజీవ్ మీనన్ ఈ వీడియోను డైరెక్ట్ చేస్తున్నారట. అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ ఇద్దరూ.. రజనీ, కమల్‌లకు మేకప్మ్యాన్లుగా ఈ వీడియోలో కనిపించబోతున్నారట. రెడ్ జాయింట్ మూవీస్, రాజ్‌కమల్ ఫిల్మ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

