Sesham Mike-il Fathima | హలో (Hello) సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా మెరిసింది పాపులర్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan). ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి (Chitralahari), రణరంగం (Ranarangam) సినిమాలతో పాటు మలయాళంలో బ్రో డాడీ (Bro Daddy), తల్లుమల్ల (Thallumalla), హృదయం (Hrudayam) చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ భామ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్గా కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం శేషమ్ మైకేల్ ఫాతిమా (Sesham Mike-il Fathima). మను సి కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించడమే కాకుండా ప్రశంసలు కూడా అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 15 నుంచి మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో రాసుకోచ్చారు. ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై జగదీష్ పళనిసామి, సుధన్ సుందరం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు.
NINGAL IDHU KAANUKA!! Mike-il ippo Fathima vannu etheetundu😍
Shesham Mike-il Fathima is coming to Netflix on 15 December in Malayalam, Telugu, Tamil, Kannada and Hindi!#SheshamMikeilFathimaOnNetflix pic.twitter.com/rzBUwFR1FJ— Netflix India South (@Netflix_INSouth) December 10, 2023
ముస్లిం కుటుంబానికి చెందిన ఫాతిమా నూర్జహాన్ (కల్యాణి ప్రియదర్శన్) ఫుట్‌బాల్ కామెంటేటర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. అయితే తాను కామెంటేటర్ అవ్వడం కుటుంబానికి నచ్చదు. ఈ క్రమంలో నూర్జహాన్ కామెంటేటర్ అయ్యిందా.. తన కుటుంబాన్ని ఎలా ఎదిరించి ముందుకుసాగింది. అనేదే తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో కల్యాణి ప్రయదర్శన్తో పాటు ఫెమినా జార్జ్, షహీన్ సిద్ధికీ, పార్వతి, అనీశ్ మీనన్, సాబుమన్ కీలకపాత్రలు పోషించారు.