ప్రభాస్ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ప్రస్తుతం ప్రీపొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్లో సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. కెరీర్లో తొలిసారి ఆయన పోలీస్ పాత్రను చేస్తుండటం విశేషం. ఈ సినిమాలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని తెలిసింది. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని చెబుతున్నారు. ‘బాహుబలి’లో ప్రభాస్ డ్యూయల్ రోల్‌ని పోషించినా..రెండు పాత్రలు తెరపై ఒకేసారి కనిపించలేదు. ‘స్పిరిట్’ చిత్రంలో మాత్రం రెండు క్యారెక్టర్స్ ఒకేసారి కనిపిస్తాయని చెబుతున్నారు. మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో రణబీర్‌కపూర్, విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారని అంటున్నారు. వీరితో పాటు ఇద్దరుముగ్గురు స్టార్ హీరోలు ఈ సినిమాలో మెరిసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజానిజాలేమిటో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.