Zarina Wahab | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మారుతి డైరెక్షన్లో కామిక్ జోనర్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. హార్రర్ కామెడీ జోనర్ రాజాసాబ్ (raja saab)తో వచ్చే సమ్మర్లో సందడి చేయనున్నాడు ప్రభాస్. కాగా పలు తెలుగు సినిమాల్లో నటించి సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అలనాటి అందాల తార జరీనా వహబ్ (Zarina Wahab). ఈ సీనియర్ బాలీవుడ్ నటి రాజాసాబ్‌లో కీలక పాత్రలో నటిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంది జరీనా వహబ్.
షూటింగ్లో ప్రభాస్‌తో తనకు భావోద్వేగపూరిత అనుబంధం ఏర్పడిందని చెప్పింది జరీనా వహబ్. ప్రభాస్ సెట్లో ప్రతీ ఒక్కరితో ఒకేలా ప్రవర్తిస్తాడు. అందరినీ సమానంగా ట్రీట్ చేస్తాడు. ప్రభాస్‌లా ఎవరూ ఉండరు. వచ్చే జన్మలో నాకు ఇద్దరు కొడుకులు ఉండాలి. అందులో ఒకరు ప్రభాస్‌లా.. మరొకరు సూరజ్ (జరీనా కుమారుడు)లా ఉండాలని నా కోరిక అంటూ చెప్పుకొచ్చింది.
అంతేకాదు ప్రభాస్‌కు ఈగోలాంటిదేమీ ఉండదని, తరచూ సెట్లో ప్యాకప్ అయిపోయిన తర్వాత కూడా ప్రతీ ఒక్కరితో మాట్లాడుతాడు. సెట్లో చాలా మందికి భోజనం పెడతాడు. నిజాయితీగా ఉంటాడు.. ఎవరితో దురుసుగా ప్రవర్తించడు. ప్రభాస్ ఎంత అద్భుతమైన వ్యక్తి అనేది చెప్పలేను. ఆ అల్లా ప్రభాస్‌కు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పింది.
ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Jailer 2 | తలైవా బర్త్ డే స్పెషల్.. జైలర్ 2 షూటింగ్ షురూ అయ్యే టైం ఫిక్స్