బాలీవుడ్ నటుడు విజయ్వర్మతో సీనియర్ నాయిక తమన్నా ప్రేమతో ఉందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. నూతన సంవత్సరం వేడుకల్లో ఈ జంట సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో వీరి మధ్య అనుబంధం బయటపడింది. అప్పటి నుంచి ఈ జంట ముంబయిలో పలు ప్రైవేట్ వేడుకల్లో చెట్టపట్టాలేసుకొని తిరుగుతూ కనిపించారు.
అయితే ఇప్పటివరకు తన ప్రేమాయణం గురించి ఎక్కడా పెదవి విప్పలేదు తమన్నా. తాజాగా ఈ జంట ముంబయిలో ఓ పార్టీ నుంచి బయటకు వస్తూ కెమెరా కంటబడ్డారు. అక్కడున్న మీడియా ప్రతినిధులకు హాయ్ చెబుతూ కారులో వెళ్లిపోయారు. ఇప్పుడీ వీడియో సోషల్మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ప్రస్తుతం తమన్నా తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తున్నది.