RC16 Movie | అనుకున్న దానికంటే గేమ్ చేంజర్ సినిమా ఇంకా ఆలస్యమయ్యేలానే కనిపిస్తుంది. దాంతో రామ్‌చరణ్.. బుచ్చి బాబు సినిమా వైపు అడుగులు వేసే ఆలోచనలో ఉన్నాడని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఆఫీస్ పెట్టిన దగ్గర నుంచి.. కాస్టింగ్ ఎంపిక వరకు ప్రతీది జెట్ స్పీడ్‌లో జరుగుతుంది. బుచ్చి బాబు సైతం రామ్ చరణ్ ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోవాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు మైత్రీ కూడా బడ్జెట్ విషయంలో ఎలాంటి బౌండరీలు పెట్టుకోకుండా.. పెద్ద స్కేల్లో సినిమాను నిర్మించాలని కసరత్తులు చేస్తుందట. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా హిందీ భామను ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అందుకోసం కొంత మందిని పరిశీలించగా.. రషా తదాని అనే అమ్మాయి వైపు చిత్ర యూనిట్ మొగ్గు చూపుతున్నారట. ఇంతకీ రషా తదాని ఎవరా అంటారా?. కేజీఎఫ్-2లో ప్రధాన మంత్రిగా అదరగొట్టిన రవీనాటాండన్ గారల పట్టే రషా తదాని. ఇప్పటికే ఈ హీరోయిన్‌కు సంబంధించిన ఫోటో షూట్ కూడా పూర్తయిందట. ఇక యాక్టింగ్ ఎలా ఉందో తెలుసుకోవడమే తరువాయని తెలుస్తుంది. అందు కోసం మేకర్స్ ఓ వర్క్ షాప్‌ను నిర్వహించబోతున్నట్లు సమాచారం. అందులో పాసయితే మట్టుకు రషా తదానినే హీరోయన్‌గా ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట.
ఇక రషా తదాని ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇటీవలే బాలీవుడ్లో ఓ అగ్ర హీరో ఫ్యామిలీకి చెందిన నటుడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అభిషేక్ కపూర్ ఈ సినిమాకు దర్శకుడు. ఇలా ఒక్క సినిమా కూడా చేయకుండానే.. గ్లోబల్ స్టార్‌తో నటించే చాన్స్ రావడం అంటే విశేషం అనే చెప్పాలి. విలేజ్ రూరల్ బ్యాక్గ్రాప్లో తెరకెక్కుతున్న RC16 సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగనుందట. ఈ సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర మాండలీకంలో డైలాగులు చెప్పబోతున్నట్లు ఇన్సైడ్ టాక్.