Roshan | టాలీవుడ్ సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రోషన్. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి పెళ్లి సందD సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఎంట్రీతోనే నటనలో తన మార్క్ చూపించేందుకు గట్టిగానే ప్రయత్నించాడు. ఈ యువ నటుడు ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా ప్రాజెక్ట్ ఛాంపియన్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.
కాగా రోషన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర కథనం నెట్టింట వైరల్ అవుతోంది. గత ఏడాదికాలంగా రోషన్ తండ్రి శ్రీకాంత్‌తో కలిసి ఏకంగా 50 స్క్రిప్టులను తిరస్కరించాడట. రోషన్ కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాడట శ్రీకాంత్. తన కొడుకు కెరీర్ విషయంలో స్క్రిప్టుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నాడని ఇన్సైడ్ టాక్.
తాజా టాక్ ప్రకారం ఛాంపియన్ విడుదలైన తర్వాత రోషన్ కొత్త సినిమా ప్రకటన ఉండబోతుంది. పలువురు టాప్ ప్రొడ్యూసర్స్ రోషన్‌కు అడ్వాన్స్‌లు కూడా చెల్లించినట్టు మరో కథనం కూడా రౌండప్ చేస్తోంది. నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్ ప్రదీప్ అద్వైతం ఛాంపియన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్‌తో కలిసి స్వప్నా సినిమా నిర్మిస్తోంది.
Raashi Khanna | పవన్ సినిమాలో రాశీ ఖన్నా.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
Ravi Teja | ఇది కదా డెడికేషన్ అంటే.. తండ్రి చనిపోయిన రెండు రోజులకే షూటింగ్ స్పాట్‌కి..!
War 2 Trailer | ‘వార్ 2’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఎప్పుడంటే.!