Selfish | ధనుష్ క్లాప్ తో ఆశిష్ కొత్త మూవీ “సెల్ఫిష్” ఘనంగా ప్రారంభం
'రౌడీ బాయ్స్' చిత్రంతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. "సెల్ఫిష్" టైటిల్ తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Selfish launch ceremony | ‘రౌడీ బాయ్స్’ చిత్రంతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. “సెల్ఫిష్” టైటిల్ తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్లాప్ నివ్వగా…దర్శకుడు హరీశ్ శంకర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘మా ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ చిత్రంతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. మొదటి సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు రెండో సినిమా స్టార్ట్ చేశాడు. సుకుమార్ నేను ఆర్య సినిమాకు పనిచేశాం. ఇప్పుడంతా ప్యాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాం. మళ్లీ ఇన్నేళ్లకు సెల్ఫిష్ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. సెల్ఫిష్ అనే ఐడియా చెప్పినప్పుడే బాగా నచ్చి సినిమా చేద్దామని కాశీకి చెప్పాను. రౌడీ బాయ్స్ రిలీజ్ ముందు నుంచే ఈ కథ మీద వర్కవుట్ చేశాడు. పర్ఫెక్ట్గా స్టోరీ సెట్ అయ్యింది. ఆశిష్ కు మొదటి సినిమా టైలర్ మేడ్ కానీ ఈ సినిమా అతనికి ఛాలెంజ్ లాంటిది. సెల్ఫిష్ తో ఆశిష్ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. మొత్తం టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – మణికందన్.ఎస్, సంగీతం – మిక్కీ జే మేయర్, ఆర్ట్ – యల్లయ్య.ఎస్, సాహిత్యం – చంద్రబోస్, సహ నిర్మాతలు – హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి, నిర్మాణ సంస్థలు – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాతలు – రాజు , శిరీష్, రచన దర్శకత్వం – విశాల్ కాశీ


Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

