‘రౌడీబాయ్స్’ చిత్రంతో హీరోగా పరిచయమైన యువ కథానాయకుడు ఆశిష్ రెడ్డి నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘సెల్ఫిష్’. సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.కాశీ విశాల్ దర్శకుడు. ‘దిల్’రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ చిత్రంలో ఆశిష్ సరసన ఇవానా నాయికగా నటిస్తోంది. శనివారం ఈ చిత్రంలో ఇవానా లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో ఇవానా చైత్రగా ఫైనాన్షియల్ ఎనలిస్ట్ పాత్రలో కనిపిస్తుంది. ఆమె పాత్ర ఎంతో వైవిధ్యంగా వుంటుంది. పాతబస్తీ నేపథ్యంలో జరిగే కథ ఇది. ఆశిష్ పాత్ర ఎంతో మాసివ్‌గా వుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కి జె మేయర్, సాహిత్యం: చంద్రబోస్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి.