Madharaasi movie | తమిళ నటుడు శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మదరాశి’ ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘అమరన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శివకార్తికేయన్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 5, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కన్నడ నటి రుక్మిణి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ మొదటి సింగిల్ ‘సెలవిక కన్నమ్మా’ అనే పాటను విడుదల చేశారు. లవ్ ఫెయిల్యూర్‌గా ఈ పాట ఉండబోతుందని లిరిక్స్ చూస్తే అర్థమవుతుంది.