Sekhar Master | ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. స్టార్ హీరోల సినిమాలకి కొరియోగ్రాఫర్‌గా చేసిన శేఖర్ మాస్టర్ ఇప్పుడు బుల్లితెర షోలకి జడ్జ్‌లుగా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా శేఖర్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల ఢీ డ్యాన్స్ షోలో జాను లిరి అనే అమ్మాయి పాల్గొనడం, ఆ అమ్మాయిని శేఖర్ మాస్టర్ ఎక్కువగా పొగిడేస్తుండడం, ఆ అమ్మాయే షోకి విజేత కావడం కొంత వివాదానికి కారణమైంది. జాను లిరిని కావాలని శేఖర్ మాస్టర్ లిపించారని, జాను లిరి కంటే బాగా చేసిన వాళ్ళు ఉన్నారని, ఆ అమ్మాయికి శేఖర్ మాస్టర్ కి మధ్యే ఏదో ఉండడంతోనే ఆమెని గెలిపించాడంటూ కొంత ట్రోలింగ్ నడిచింది.
ఈ క్రమంలో తాజాగా శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. ఆ అమ్మాయి బాగా చేసింది అందుకే మెచ్చుకున్నాను. బాగా చేసిన అబ్బాయిలను కూడా పొగిడాను. బాగా చేసిన వాళ్లని అభినందించడం తప్పా. నేనేదో కావాలని గెలిపించారని కామెంట్స్ చేస్తున్నారు. నా సోషల్ మీడియా పోస్టుల కింద ఆమె పేరుతో కామెంట్స్ చేయడంతో నేను చాలా సఫర్ అయ్యాను. నాకు ఆమెకి రిలేషన్ ఉందని, ఇంకా ఏదేదో అంటూ చాలా చెత్తగా మాట్లాడారు. మా మధ్య ఏదో ఉందని మాట్లాడితే వాళ్ల, మా ఫ్యామిలీలు ఎంత బాదపడతారు. ఇలా కామెంట్స్ చేస్తే అసలు ఏమోస్తదో అంటూ శేఖర్ మాస్టర్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
మరోవైపు ఏ కొరియోగ్రాఫర్ కి దక్కని అదృష్టం నాకే దక్కింది. చిరంజీవి సర్ – చరణ్ సర్ లతో పనిచేసే ఛాన్స్ రావడమే గొప్ప అవకాశం. అలాంటిది ఇద్దర్ని కలిపి డ్యాన్స్ చేయించే అవకాశం నాకు రెండు సార్లు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఖైదీ సినిమాలో అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్, ఆచార్య సినిమాలో బంజారా సాంగ్ రెండు నేనే కంపోజ్ చేశాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ కి నాకు బాగా పేరొచ్చింది అని తెలిపారు. మొత్తానికి శేఖర్ మాస్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.