Maheshbabu In Leader Sequel |రానా కెరీర్లో బెస్ట్ చిత్రాలలో ‘లీడర్’ ముందు వరుసలో ఉంటుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలు దక్కించుకుంది. డెబ్యూగా రానా ఇంత గొప్ప సినిమాతో ఎంట్రీ ఇవ్వడం అదృష్టమనే చెప్పాలి. అర్జున్ ప్రసాద్‌గా రానా సీఎం పాత్రలో ఒదిగిపోయాడు. శేఖర్ కమ్ములా డైలాగ్స్, టేకింగ్ ఇప్పటికి కొత్తగా కనిపిస్తాయి. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా అంత సక్సెస్ కాలేదు. కానీ ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
దాదాపు 12 ఏళ్ళ తర్వాత సీక్వెల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. శేఖర్కమ్ములా ‘లీడర్-2’ స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడట. అంతేకాకుండా సీక్వెల్‌ను మహేష్‌బాబుతో తీయాలని ప్లాన్స్ చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత అరున గుహన్ తెలిపారు. మహేష్ కూడా ‘భరత్ అనే నేను’ సినిమాలో సీఎంగా ప్రేక్షకులను అలరించాడు. మరోసారి అలాంటి పాత్రలో మహేష్‌ను చూడాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఒకవేళ ఈ కాంబో మాత్రం సెట్ అయితే ఈ సారి కమర్షియల్‌గా కూడా లీడర్-2 హిట్టవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం మహేష్, తివిక్రమ్‌తో సినిమాకు ముస్తాబవుతున్నాడు. ఇప్పటికే వర్కవుట్లను కూడా మొదలుపెట్టాడు. ఈ చిత్రం తర్వాత రాజమౌళితో యాక్షన్ అడ్వేంచర్ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తవ్వాలంటే మినిమం 3 సంవత్సరాలైన పడుతుంది. ఈలోగా శేఖర్ కమ్ములా ధనుష్‌తో బైలింగ్యూవల్ ప్రాజెక్ట్, నాగచైతన్యతో మరో సినిమాను కంప్లీట్ చేసి ‘లీడర్-2’ స్క్రిప్ట్‌ను మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట.