Seize The Ship | డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మొన్న కాకినాడ పోర్టులో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. పనామ దేశానికి చెందిన ఒక షిష్‌లో అక్రమంగా విదేశాలకు తరలి వెళుతున్న రేషన్ బియ్యంను పట్టుకుని సీజ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే షిప్లో బియ్యాన్ని పట్టుకున్న అనంతరం పవన్‌కల్యాణ్ సీజ్ ద షిప్ అంటూ పలికిన విషయం తెలిసిందే. సినిమా లెవల్ ఎలివేషన్‌తో ఈ మాట అనడంతో సోషల్ మీడియా అంతటా ఆరోజు సీజ్ ద షిప్ అనే డైలాగ్ బాగా వైరల్ అయ్యింది. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ మాటను బాగా ట్రెండ్ చేశారు.
ఇదిలావుంటే తాజాగా సీజ్ ద షిప్ అనే టైటిల్‌ని తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకుంది టాలీవుడ్‌కి చెందిన నిర్మాణ సంస్థ. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ.. సీజ్ ద షిప్ (Seize The Ship) అనే టైటిల్‌ను రూ.1000లకు నమోదు చేసుకుంది. ఏడాది పాటు టైటిల్ హక్కులు వర్తించనున్నాయి.
Trend setter @PawanKalyan 😌#SeizeTheShip pic.twitter.com/7rmtD6876H
— Vijay kalyan cult (@VijayKalyanCult) December 4, 2024