
Sehari movie | హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం సెహరి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విర్గొ పిక్చర్స్ బ్యానర్‌పై అద్వయ జిష్ణురెడ్డి-శిల్పా చౌదరీలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం విడుదలచేసిన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రశాంత్ విహరి అందించిన పాటలు అలరిస్తున్నాయి. ఇప్పటికే ఇది చాలా బాగుందిలే పాట యూట్యూబ్‌లో కోటి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లను మేకర్స్ జోరుగానే చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గతంలో నటసింహం నందమూరి బాలకృష్ణ విడుదల చేశాడు. అంతేకాకుండా ఆ కార్యక్రమంలో బాలకృష్ణ, హర్ష్ కనుమిల్లిని వర్జిన్ స్టార్ అనడం అప్పట్లో వైరల్ కూడా అయ్యింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.అభినవ్ గౌతమ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్:ఆనంద్ విశ్యనాథన్, ఎడిటర్:రవిరాజా గిరిజాల.
Get ready for the celebration of Ultimate FUN Feast! 🎉🥳#𝐒𝐄𝐇𝐀𝐑𝐈 Grand Release Only in Theatres on 𝙁𝙚𝙗𝙧𝙪𝙖𝙧𝙮 11𝙩𝙝 Worldwide🤘🏻😍#SehariOnFeb11 @HarshKanumilli @SimranCOfficial @gnanasagardwara @prashanthvihari #AdvayaJishnuReddy @PicturesVirgo @adityamusic pic.twitter.com/pPkDYbuIDg
— Virgo Pictures (@PicturesVirgo) January 31, 2022