seetimaarr సెన్సర్ రివ్యూ .. గోపీచంద్ హిట్ కొట్టబోతున్నాడా?

seetimaarr censor review | గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటీమార్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సంపత్ నంది. దేశంలో మగవాళ్లు 60 ఏళ్లు బతుకుతారంట.. ఆడవాళ్లు కూడా 60 ఏళ్ళు బతుకుతారంట కానీ 20 ఏళ్లకే చంపేస్తున్నారు అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్‌తో సినిమాలో మహిళా ప్రాధాన్యత ఎక్కువగా ఉందని అర్థమైపోతుంది. సౌత్ కా సత్తా మార్ కే నహీ.. సీటీమార్ కే దిఖావూంగా అంటూ కమర్షియల్ డైలాగులు బాగానే రాశాడు సంపత్ నంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు సెన్సార్ పూర్తి కావడంతో విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ రివ్యూ ప్రకారం రొటీన్ కథనే స్పోర్ట్స్‌కు ముడిపెట్టి కమర్షియల్ పంథాలో సంపత్ తెరకెక్కించాడని తెలుస్తుంది.
సెన్సార్ బోర్డ్ నుంచి సినిమాకు మంచి టాక్ వచ్చింది. సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు హీరోయిన్ తమన్నా అందాల ప్రదర్శన కూడా బాగానే ఉంది. దాంతో యు కాకుండా ఏ కూడా తోడుగా ఇచ్చారు. యు/ఏ రావడంతో చిత్ర యూనిట్ కూడా సంతోషంగానే ఉన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు సంపత్ నంది. 138 నిమిషాల రన్ టైమ్‌తో వస్తుంది సీటీమార్. అంటే మంచి రన్ టైమ్ అన్నమాట. బోర్ కొట్టకుండా చెప్తే సినిమా పెద్ద విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2 గంటల 18 నిమిషాలు మాత్రమే అంటే షార్ప్ రన్ టైమ్ తోనే సీటీమార్ సినిమా వచ్చేస్తుంది. సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా సినిమా విడుదల కానుంది. లౌక్యం తర్వాత ఆరేళ్లుగా సరైన విజయం లేని గోపీచంద్.. సీటీమార్‌తో సత్తా చూపించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.
నిజానికి లౌక్యం తర్వాత గోపీచంద్ స్థాయికి తగ్గ సినిమాలు రాలేదు. సంపత్ నంది ఫ్లాపుల్లోనే ఉన్నా కూడా ఈయన్ని నమ్మి ఈ చిత్రం చేశాడు గోపీచంద్. కబడ్డీ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ బాలరెడ్డిగా గోపీచంద్.. తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ జ్వాలా రెడ్డిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో హిట్ కొట్టి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు గోపీచంద్. గతంలో గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్లో వచ్చిన గౌతమ్ నందా ఫ్లాప్ అయింది. సెప్టెంబర్ 10న సీటీమార్ విడుదల కానుంది. మొత్తానికి చూడాలిక.. ఈ చిత్రంతో గోపీ ఏం మాయ చేస్తాడో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
యజ్ఞం అసలు హీరో గోపీచంద్ కాదు.. మరి ముందు అనుకున్నది ఎవర్ని..?
సంపాదించినది అప్పులకే సరిపోయింది.. కన్నీరు పెట్టుకున్న రోజా
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kasturba School | రాఘవపూర్ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆకస్మిక మృతి
Ham Roads | హ్యామ్ రోడ్డు టెండర్ల కోసం మంత్రుల మధ్య వార్.. నలిగిపోతున్న అధికారులు
Maharastra | సీఎం ఫడ్నవీస్ ఇలాకాలో బీజేపీకి షాక్.. నాగ్‌పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన.. వెంకీ, త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

