Seethamma Vakitlo Sirimalle Chettu | ‘తొలిప్రేమ’ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఐదేళ్లు సినిమా రైట్స్ మా వద్ద ఉండేవి. మాకు ఎప్పుడు డబ్బులు తక్కువైనా సినిమాను రీరిలీజ్ చేసేవాళ్లం. డబ్బులొచ్చేవి. అవన్నీ మిరాకిల్స్ డేస్. ఇప్పుడు కూడా రీరిలీజ్లపై ఆడియన్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందుకే.. మా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాని రీరిలీజ్ చేస్తున్నాం. ఇప్పటికే పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి. సినిమా ఆల్రెడీ ఓటీటీలో ఉంది. అయినప్పటికీ జనం థియేటర్లలో చూడ్డానికి ఇష్టపడుతున్నారంటే ఆ సినిమా గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.’ అని దిల్‌రాజు అన్నారు.
2013లో వెంకటేశ్, మహేశ్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రాన్ని ఈ నెల 7న గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజు బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘అన్నదమ్ముల అనుబంధాలను, భావోద్వేగాలను మళ్లీ తెరపై చూసి ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులు భావించారు. అందుకే థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. మంచి కంటెంట్‌తో సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని రీరిలీజులు నిరూపిస్తున్నాయి. తెలంగాణ, ఏపీల్లో ఆడ్వాన్స్ బుకింగులు ఆశాజనకంగా ఉన్నాయి. 7వ తారీకున సుదర్శన్ 35ఏంఏంలో ఎనిమిదిగంటల షో చూస్తాను. బ్రదర్స్ వస్తున్నారు.. అందరూ థియేటర్లలో ఎంజాయ్ చేయండి’ అన్నారు దిల్‌రాజు.