‘ఈ సినిమా విషయంలో దర్శకుడ్ని గుడ్డిగా నమ్మేశాను. నా నమ్మకాన్ని నిజం చేస్తూ మంచి రిజల్ట్ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనువైట్లకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థియేటర్లో ప్రతి సన్నివేశాన్నీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వారి నవ్వులు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇందులో చిన్నపాప సెంటిమెంట్ కూడా బాగా వర్కవుట్ అయింది. ప్రేక్షకులు ఓన్ చేసుకుంటే సినిమాను ఎంత దూరమైనా తీసుకెళ్తారని ఈ సినిమా నిరూపించింది.’ అని గోపీచంద్ అన్నారు. ఆయన హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఈ నెల 11న సినిమా విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో గోపీచంద్ మాట్లాడారు. ‘నా బలం కామెడీ అని అందరూ చెప్తారు. ఆ కామెడీనే ఈ సినిమా హిట్‌కి కారణమైంది. ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చడానికి ముఖ్య కారణాలు మదర్ ఎమోషన్, పాప ట్రాక్. వీటికితోడు మంచి యాక్షన్ ఉంది. కాబట్టే ఇంత విజయం దక్కింది. ప్రతి టెక్నీషియన్ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని పనిచేశారు. గోపీచంద్ ఫ్రీడమ్ ఇచ్చి, సపోర్ట్‌గా నిలబడ్డారు. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు కాబట్టే ఈ విజయం’ అని శ్రీను వైట్ల చెప్పారు. ఇంకా నరేశ్, అనిషా అంబ్రోస్, పృధ్వీ, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్, డీవోపీ గుహన్, ఎడిటర్ అమర్ కూడా మాట్లాడారు.