ఓటీటీ హిట్
ఐబీ 71 (హిందీ)
డిస్నీ+హాట్‌స్టార్: జూలై 7
తారాగణం: విద్యుత్ జమ్వాల్, అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా తదితరులు
దర్శకత్వం: సంకల్ప్‌రెడ్డి
యుద్ధం నేపథ్యంలో నిర్మించిన సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువ. అందులోనూ భారత్-పాకిస్థాన్ వార్ కథాంశం అయితే చెప్పనక్కర్లేదు. ఐబీ 71- ఇండియాస్ టాప్ సీక్రెట్ మిషన్ సినిమా కథ కూడా ఇదే. ఘాజీ, అంతరిక్షం సినిమాలతో తన సత్తా చాటిన సంకల్ప్‌రెడ్డి దీనికి దర్శకుడు. కథలోకి వెళ్తే 1971లో ఘాజీ అటాక్ తర్వాత చైనాతో పాకిస్థాన్ చేతులు కలుపుతుంది.
దాయాది దేశం కయ్యానికి కాలుదువ్వుతుందన్న సంగతి ఇంటెలిజెన్స్ బ్యూరో ఏజెంట్ దేవ్ (విద్యుత్ జమ్వాల్) పసిగడతాడు. వారి ప్రయత్నాలను భగ్నం చేయడానికి రంగంలోకి దిగుతాడు. మరోవైపు కాశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలనే డిమాండ్‌తో తీవ్రవాదులు భారత్‌కు చెందిన విమానాన్ని హైజాక్ చేస్తారు. ఈ హైజాక్‌కు, పాకిస్థాన్‌కు సంబంధం ఏంటి? శత్రుదేశం ఎత్తులను దేవ్ చిత్తు చేయడంలో సఫలమయ్యాడా? అన్నది మిగిలిన కథ. హాట్‌స్టార్‌లో రికార్డు స్ట్రీమింగ్ సొంతం చేసుకుంటున్న ఐబీ 71 ప్రేక్షకులకు మంచి స్పై సినిమా చూసిన అనుభూతిని పంచుతుంది.