Sebastian movie | కరోనా ఉదృతి తగ్గడంతో వాయిదా పడ్డ సినిమాలతో పాటు కొత్త సినిమాలు కూడా విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్, సర్కారు వారి పాట వంటి పెద్ద సినిమాలు విడుదలతేదీలను ప్రకటించగా తాజాగా మీడియం బడ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజావారు రాణివారు, SRకళ్యాణమండపం సినిమాలతో వరుస హిట్లు కొట్టిన కిరణ్ అబ్బవరం కూడా తన సినిమా డేట్ ప్రకటించాడు. ఈయన నటించిన తాజా చిత్రం సెబాస్టియన్ పీసీ 524తో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు. దీంతో ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అయితే అక్కడే ఒక చిక్కు ఉంది. అదే రోజు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో వస్తున్నాడు. దానికి పోటీగా కిరణ్ అబ్బవరం సినిమా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
కిరణ్ అబ్బవరం ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు.ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఈ హీరోకు ఓ ఆసక్తికర ప్రశ్న సందించాడు. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ విడుదల ఉందని మీకు తెలియదా భయ్యా.. ఆరోజే మీ సెబాస్టియన్ పి సి 524 ను రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన మీరు అదే రోజు మీ సినిమాను విడుదల చేస్తారు అని నెటీజన్ అడిగాడు. దీనికి స్పందించిన యంగ్ హీరో నేను మీకంటే కాస్త ఎక్కువగానే భీమ్లా నాయక్ కోసం ఎదురు చూస్తున్నాను.. ఆరోజు నా సినిమా విడుదల అయినా కూడా నేను పవర్ స్టార్ సినిమాకే మొదటి షో వెళతాను.. ఫస్ట్ షో రచ్చ ఆయన మూవీ తోనే అని రిప్లై ఇచ్చాడు. పరిస్తితుల అనుగుణంగా భీమ్లానాయక్ చిత్రాన్ని ఫిబ్రవరి 25న లేదా ఎప్రిల్ 1న విడుదలచేస్తామని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు.
Maa Ammaki ichina maate meeku ichina maate .. Blindga vacheyandi -Seba .#Sebastianpc524 on Feb 25th . pic.twitter.com/dylJ4gWDOZ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 1, 2022
Thanks for your share sir..we just want to show you the trailer we are happy that you liked and shared ☺️ https://t.co/UIsBAaUgo1
— Kiran Reddy (@kiranabbavaram) January 27, 2017