SDT15 Latest Update | మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాయిధరమ్ తేజ్. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన తేజ్.. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’, ‘చిత్రలహరి’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది ఈయన నటించిన ‘రిపబ్లిక్’ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈయన కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
ఈ సినిమా గ్లింప్స్‌ను డిసెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రీలుక్ పోస్టర్లు సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ పెంచాయి. ఒక ఊరిని వరుస చావులు వెంబటిస్తుంటాయి. ఆ చావులకు గల కారణాలు ఏంటీ అని తెలుసుకోవాడానికి హీరో ఆ ఊరికి వెళ్తాడు. అయితే అక్కడ ఎలాంటి పరిస్థతులు ఎదురయ్యాయి. అసలు ఆ చావుల వెనక ఉన్న మిస్టరీ ఎంటీ అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు టాక్. ఈ చిత్రంలో బ్లాక్ మేజిక్ వంటి అంశాలను టచ్ చేసినట్లు టాక్.
మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లేతో అందించడంతో పాటు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సాయి ధరమ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే నటిస్తుంది. ఇక సుకుమార్ కథ అందించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగానే అంచనాలున్నాయి.
Into the World of #SDT15 👁️
With 'An Intriguing Title Glimpse' on 7th December.#SDT15TitleGlimpse @IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @aryasukku @BvsnP @bkrsatish @SVCCofficial @SukumarWritings pic.twitter.com/e8EGegPT3j
— SVCC (@SVCCofficial) December 4, 2022