Save The Tigers | తెలుగు వెబ్ సిరీస్‌లలో వచ్చిన రీసెంట్ బెస్ట్ కామెడీ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చిన ఈ సిరీస్ రికార్డు వ్యూస్‌తో కామెడీ ఎంటర్టైనర్గా మంచి విజయాన్ని అందుకుంది. తేజ కాకుమాను దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయానిలు ప్రధాన పాత్రలను పోషించారు. ఇక ఈ సిరీస్ సీజన్ 2 ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారి నిరీక్షణకు తెరదించుతూ పార్ట్ 2 అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 ను త్వరలోనే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నిత్య జీవితంలో మగవారు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. పూర్తిగా కామెడీ టచ్‌తో వస్తున్న ఈ వెబ్ సిరీస్‌పై మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.