Krishnamma Title Song | ఫలితంతో సంబంధం లేకుండా కంటెంట్ ప్రధానంగా ఉన్న కథలను ఎంచుకుంటూ హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు సత్యదేవ్. హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘కృష్ణమ్మ’ ఒకటి. వి.వి గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు. టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు క్లాస్ సినిమాలతో మెప్పించిన సత్యదేవ్ మొదటి సారిగా అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ సాంగ్ అప్డేట్ను ప్రకటించారు. కృష్ణమ్మ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను సెప్టెంబర్ 3న ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ‘ఏమంటుందో’ పాటకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా అతిరా రాజీ హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నాడు.
ఆ కృష్ణమ్మ తో ముడిపడిన జీవితాలు ❤️#Krishnamma Title Song on 3rd September at 11.07 AM ❤️🔥
A @kaalabhairava7 Musical.
Singer @anuragkulkarni_
Lyrics by @IananthaSriram@ActorSatyaDev @dirvvgopal @ArunachalaCOffl #KoratalaSiva @saregamasouth pic.twitter.com/psArYEgo1K— BA Raju's Team (@baraju_SuperHit) September 1, 2022