సత్యదేవ్, డాలీ ధనుంజయ లీడ్‌రోల్స్ చేస్తున్న చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. ఎస్‌ఎన్‌రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం నిర్మాతలు. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని తొలిపాటను మేకర్స్ విడుదల చేశారు. ‘మేరీ తేరీ..’ అంటూ సాగే ఈ పాటను పూర్ణాచారి రాయగా, రవి బస్రూర్ స్వరపరిచారు.
విజయలక్ష్మి, సంతోష్ వెంకీ ఆలపించారు. హీరోహీరోయిన్లు సత్యదేవ్, ప్రియా భవానీశంకర్ పాత్రల కెమిస్ట్రీని ఈ పాటలో అద్భుతంగా విష్కరించారని, విజువల్స్ కూడా సూపర్‌గా ఉంటాయని మేకర్స్ తెలిపారు. సత్యరాజ్, సత్య అక్కల, జెన్నిఫర్ పిషినాటో, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మీరాఖ్, కెమెరా: సత్య పొన్మార్, సహనిర్మాత: ఎస్.శ్రీలక్ష్మీరెడ్డి.