Satyadev | ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్లో యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న సెలబ్రిటీల్లో ఒకరు సత్యదేవ్ (Satyadev). సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలను ఎంపిక చేసుకుంటూ హిట్స్‌ను ఖాతాలో వేసుకుంటాడు సత్యదేవ్. ఈ క్రేజీ యాక్టర్ ఇటీవలే కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే సత్యదేవ్‌కు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం VD 12. కాప్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ భారీ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్లోకొనసాగుతుంది. మూడు వారాలుగా చిత్రీకరణ కొనసాగుతుండగా.. సత్యదేవ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడని ఇన్సైడ్ టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని తెలుస్తోంది.
మరి విజయ్ దేవరకొండ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది. సత్యదేవ్ ప్రస్తుతం ఫుల్ బాటిల్, జీబ్రా, గరుడ చాఫ్టర్ 1 సినిమాలను లైన్లో పెట్టాడు. కోవిడ్ సమయంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ను ఖాతాలో వేసుకున్నాడు సత్యదేవ్.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి పాపులర్ మలయాళం సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ పనిచేస్తున్నారు. ఈ మూవీకి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు.
ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ నయా స్టిల్స్..
Stylish clicks of @TheDeverakonda ❤️🔥#VijayDeverakondapic.twitter.com/3mdXrh9RIX
— Suresh PRO (@SureshPRO_) October 29, 2023