Godse OTT | ఓటీటీలోకి సత్యదేవ్ ‘గాడ్సే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Godse Movie On OTT | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవలే ‘గాడ్సే’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూన్ 17న విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్‌గా మిగిలింది. గోపి గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 17 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా మలయాళ కుట్టి ఐశ్వర్య హీరోయిన్గా నటించింది. నాగబాబు కీలకపాత్రలో నటించాడు. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో పాటుగా హిందీలో అక్షయ్ కుమార్ ‘రామ్‌సేతు’లో కిలకపాత్ర పోషిస్తున్నాడు. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’లోనూ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత కొంత కాలంగా ఈయన సినిమాలకు ప్రశంసలు దక్కుతున్న కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాయి. నిజానికి కొందరికి ఈయన సినిమాలు ఎప్పుడు విడుదలవుతున్నాయో.. ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో కూడా తెలియడం లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నంబర్ ప్లేట్లు.. నిబంధనలకు తూట్లు!.. బాస్, ఐగాడ్, 1, 3, 9తో నంబర్ ప్లేట్లు
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

