ఇటీవల తిమ్మరసు చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చి అలరించిన సత్యదేవ్ త్వరలో చిరంజీవితో కలిసి సినిమా చేయనున్నాడు. ఆయన ప్రస్తుతం తీవ్రవాదం నేపథ్యంలో రూపొందుతున్న హబీబ్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
హబీబ్ షూటింగ్ తీవ్ర ఆటంకాలు, ప్రమాదాల నడుమ భయపడుతూ రూపొందిన సంగతి తెలిసిందే. తాలిబన్ దేశాన్ని తిరిగి సాధించుకునేందుకు తాలిబన్లు తీవ్రమైన పోరాటం సాగిస్తున్న క్రమంలో ఆ దేశానికి వెళ్లి షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఇది ఎంతో రిస్కీ అని తెలిసినా సత్యదేవ్ తన ప్రయత్నాన్ని మాత్రం వీడలేదు. ఓ వైపు షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రాణాపాయ బెదిరింపులను అతడు ఎదుర్కొన్నాడట.
చంపేస్తామంటూ బెదిరించారని అతడు తెలిపారు. కాబూల్ లో బెదిరింపుల మధ్య సత్యదేవ్ హబీబ్ షూటింగ్లో పాల్గొన్నాడు. ఆర్మీ తరహా దుస్తులు ధరించి సత్యదేవ్ పై చిత్రీకరణను చేయగా అతడి వేషధారణ కారణంగా ఒక దశలో తాలిబాన్ అని పొరపాటు పడ్డారట. స్థానిక పోలీసుల కోసం సందేహాలను నివృత్తి చేయడానికి భారత రాయబార కార్యాలయం వారి ఆధారాలను చూపించాల్సి వచ్చింది. ప్రమాదకర ప్రాణహాని ఉన్నా సినిమా పై తనకు ఉన్న ఫ్యాషన్ ని సత్యదేవ్ విడవకపోవడం విశేషం.