కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సత్యదేవ్. ప్రస్తుతం ఆయన ‘కేరాఫ్ కంచర్ల పాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బ్రిటీష్‌కాలం నాటి కథ ఇదని సమాచారం. తాజాగా ఈ చిత్రానికి ‘రావు బహదూర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.