Satyabhama | గతేడాది భగవంత్ కేసరి సినిమాతో భారీ హిట్ అందుకున్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈసారి పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘సత్యభామ’ (Satyabhama)’. నవీన్ చంద్ర కథానాయకుడిగా నటిస్తున్నాడు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తుండగా.. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ టిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు మొదటి రెండు పాటలు విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ నుంచి వెతుకు వెతుకు (Vethuku Vethuku) అనే థర్డ్ సింగిల్‌ను మే 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాద్ నగరాన్ని కదిలించిన భయంకరమైన హత్య కేసును పోలీసాఫీసర్‌గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఎలా పరిష్కరించారనేది ఈ మూవీ. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
An anthem for all the strong women out there 🔥#Satyabhama Third single #VethukuVethuku out on May 15✨
‘The Queen of masses’ @MSKajalAggarwal @Naveenc212 @AurumArtsoffl @sumanchikkala @sashitikka @SriCharanpakala @bobytikka @kalyankodati @KumarTV5Cinema @RekhaBoggarapu… pic.twitter.com/RyADj2lGbK
— BA Raju’s Team (@baraju_SuperHit) May 11, 2024