సత్యదేవ్, కన్నడ నటుడు డాలీ ధనంజయ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనేది ఉపశీర్షిక. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి, ఎస్.పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం నిర్మాతలు. అక్టోబర్ 31న దీపావళి కానుకగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ మంగళవారం మోషన్ పోస్టర్ని విడుదల చేశారు.
ఈ పోస్టర్లోనే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. సత్యరాజ్, సత్య అక్కల, జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీశంకర్, డాలీ ధనంజయ, సత్యదేవ్లను ఈ పోస్టర్ పరిచయం చేసింది. కాయిన్ తిప్పడం, కరెన్సీ నోట్లు, ైఫె ్లఓవర్ బ్రిడ్జిపై నుంచి కారు దూకడం వంటి డైనమిక్ ఎలిమెంట్స్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సత్య పొన్మార్, సంగీతం: రవి బస్రూర్, సహనిర్మాత: ఎస్.శ్రీలక్ష్మిరెడ్డి, నిర్మాణం: పద్మజ ఫిల్మ్స్ ప్రై.లిమిటెడ్, ఓల్డ్‌టౌన్ పిక్చర్స్.