Zebra Movie | టాలీవుడ్ యువ నటులలో సత్యదేవ్ ఒకడు. జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. అయితే సత్యదేవ్‌కి గత కొన్ని రోజులుగా సరైన హిట్ పడలేదన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో కృష్ణమ్మ అంటూ ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా నిలిచింది ఈ చిత్రం. అయితే తాజాగా ‘జీబ్రా’(Zebra) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్ ఈ సినిమాతో చాలా రోజులకు ఒక మంచి హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ (Eswar Karthik) దర్శకత్వం వహించగా.. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 22న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా హిట్ అందుకున్న సందర్భంగా సత్యదేవ్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
ఇది మీరు ఇచ్చిన విజయం. మీరు బాగుంది అన్నారు. అంతకన్నా ఏం కావాలి. ఒక్క థియేట్రికల్ హిట్ కోసం 5 ఏండ్లుగా వెయిట్ చేస్తున్నా. మీకు నచ్చే సినిమా చేయడానికి.. మీతో హిట్ కొట్టావు అనిపించుకోవడానికి నిరంతరం కష్టపడుతున్నా. నేను హిట్ కొడితే మీరు కొట్టినట్లు ఫీల్ అవుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. బ్లఫ్ మాస్టర్ సినిమాని మీరు థియేటర్లో మిస్ అయ్యి ఓటీటీలలో టీవీలలో చూసిన అనంతరం సినిమాపై ప్రశంసలు కురిపించారు. ‘జీబ్రా’(Zebra) సినిమాకి అలా జరగవద్దని కోరుకుంటున్నాను. దయచేసి జీబ్రా సినిమాను థియేటర్లో చూడండి. ఈ సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుంది. మిస్ అవ్వోద్దు అంటూ సత్యదేవ్ వెల్లడించాడు.
తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు, #ZEBRA – బొమ్మ సూపర్ హిట్-uu ❤️ ఎప్పటికీ రుణపడి ఉంటాము🙏
Live, let live.
Grow, let grow. pic.twitter.com/yJX25lfe39— Satya Dev (@ActorSatyaDev) November 26, 2024