‘కపుల్ ఫ్రెండ్లీ’ విజయంతో మంచి జోష్ మీదున్నారు హీరో సంతోష్ శోభన్. ఈ నేపథ్యంలో నెక్ట్స్ సినిమా షూటింగ్‌కి ఆయన సిద్ధమవుతున్నారు. సినిమా పేరు ‘సత్తిబాబు పరలోక యాత్ర’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఏఆర్ ఫిల్మ్స్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ‘స్వాతిముత్యం’ఫేం లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకుడు.
కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనున్నదని, జూన్ తొలివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, ‘కపుల్ ఫ్రెండ్లీ’ తర్వాత యూవీ క్రియేషన్స్ నుంచి వస్తున్న ఈ చిత్రం సంతోష్శోభన్కి మరో బ్లాక్‌బస్టర్ అవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.