ఆకట్టుకునే ప్రేమ కథతో
సతీష్ మేరుగు, హృతికా సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏయ్ బుజ్జి నీకు నేనే’. సంజన చరణ్ సమర్పణలో ఎస్ఎస్ మూవీ కార్పొరేషన్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో సతీష్ మేరుగు రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
అతిథిగా హాజరైన నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ..‘మంచి కంటెంట్‌తో సినిమా చేసినట్లు తెలుస్తున్నది. సతీష్ మేరుగు అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు’ అని అన్నారు.
సతీష్ మేరుగు మాట్లాడుతూ..‘ఈ సినిమాలో మంచి ప్రేమకథతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలూ ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకుల ఆదరణను పొందుతుందని ఆశిస్తున్నా. త్వరలో చిత్ర విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు. దేవా, అభినవ్ సింగ్ రాఘవ్, మాధవి ప్రసాద్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

