బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఒకప్పుడు యువతరాన్ని ఓ ఊపు ఊపేసింది. ‘కభీ ఖుషి.. కభీ గమ్’, ‘అజ్నబీ’, ‘గోల్మాల్ రిటర్న్స్’ తదిరతర సినిమాలతో ఆమె బాలీవుడ్ ప్రేక్షకులనే కాదు.. యావత్ భారతదేశ సినీ అభిమానుల మనస్సు దోచుకుంది. సైఫ్తో పెళ్లైన తర్వాత సినిమాలను కాస్త తగ్గించిన ఈ ముద్దుగుమ్మ వైవిధ్యమైన సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తుంది.
2012 సంవత్సరంలో కరీనా-సైఫ్ వివాహం జరిగింది. వీరికి మొదటి సంతానంగా 2016లో తైమూర్ అలీ ఖాన్ జన్మించారు. ఇటీవల మళ్లీ మగబిడ్డ పుట్టాడు. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. అయితే పెళ్లి జరిగి.. ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా.. కరీనా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. హీరోయిన్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంది. తాజాగా తన ఎద అందాలను ఎలివేట్ చేస్తూ.. అభిమానులకి పిచ్చెక్కించే ప్రయత్నం చేసింది.
తాజాగా తన భర్త సైఫ్ అలీఖాన్ తో కలిసి బయటకి వచ్చిన కరీనా బ్లాక్ కలర్ మెష్ టాప్లో కనపడింది. కింద ప్యాంటు లాంటిది వేసి, పైన నెక్ లెస్ ఓపెన్ టాప్ వేసింది. దీంతో ఫొటోగ్రాఫర్స్ ఆమెని తమ కెమెరాలలో బంధించారు. ఈ ఫోటోలు చూసిన వాళ్లంతా పలు కామెంట్లు చేస్తున్నారు. ‘ఏంటి కరీనా నైటీతో బయటకి వచ్చావు’ , ‘ఇంట్లో నైటీలు వేసుకోవట్లేదా ఇలా బయటకు నైటీలు వేసుకొచ్చావు’ అంటూ పలు కామెంట్స్ చేస్తున్నారు.