సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతికిరణ్ ఇతర కీలక పాత్రధారులు. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వానర సెల్యూలాయిడ్ పతాకంపై విజయ్‌పాల్ రెడ్డి అడిదెల నిర్మించారు. దర్శకుడు మారుతి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తొలుత ఈ చిత్రాన్ని ఈ నెల 22న రిలీజ్‌కు సన్నాహాలు చేశామని, అయితే సరైన థియేటర్ల లభ్యత కోసం 29కి వాయిదా వేశామని మేకర్స్ తెలిపారు. పౌరాణిక పాత్ర ఈ లోకంలోకి వస్తే ఏం జరిగిందన్నదే ఈ చిత్ర కథాంశమని, సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా మెప్పిస్తుందని, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని దర్శకుడు తెలిపారు.