Sathyaraj | తమిళ సీనియర్ నటుడు బాహుబలి ఫేమ్ కట్టప్ప సత్యరాజ్ పొలిటికల్ బయోపిక్ చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై ఓ బయోపిక్ రాబోతుండగా.. ఈ బయోపిక్‌లో సత్యరాజ్ మోదీ పాత్ర పోషించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై సత్యరాజ్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. నరేంద్ర మోదీ బయోపిక్‌లో నేను నటించనున్నట్లు వస్తున్న వార్తలు అబద్దం. ఇటువంటి అబద్దపు వార్తలు నమ్మకండి. నేను పెరియార్ వాదిని. భారతీయ సామాజిక కార్యకర్త , ‘ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియార్‌ను ఆరాధించే నేను మోదీ బయోపిక్‌లో నటిస్తారని ఎలా అనుకున్నారు అంటూ సత్యరాజ్ చెప్పుకోచ్చాడు.