Sathyaraj breaks silence on Sivaji | తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం శివాజీ. కమర్శియల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విలన్‌గా సుమన్ నటించాడు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రకి మొదటగా సత్యరాజ్‌ని అనుకున్న విషయం తెలిసిందే. కానీ అనుకొని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి సత్యరాజ్ తప్పుకున్నాడు. దీంతో మీడియాలో రజనీకి, సత్యరాజ్‌కి గొడవ అయ్యిందని అందుకే ఈ సినిమా చేయడానికి సత్య రాజ్ ఒప్పుకోలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దాదాపు 18 ఏండ్ల తర్వాత ఈ వివాదంపై తాజాగా స్పందించాడు నటుడు సత్యరాజ్. తాను శివాజీ సినిమా ఎందుకు చేయలేదు అనే కారణాన్ని వెల్లడించాడు.
శివాజీ సినిమా నేను ఒప్పుకోకపోవడానికి బలమైన కారణముంది. నా కెరీర్ అప్పుడప్పుడే మొదలైంది. అప్పుడే హీరోగా నటించడం గుర్తింపు రావడం జరుగుతుంది. ఆ సమయంలో శంకర్ నా దగ్గరికి వచ్చి విలన్ రోల్ ఆఫర్ చేశాడు. నేను అప్పుడు విలన్‌గా అంగీకరించి ఉంటే తర్వాత నాకు అన్ని విలన్ పాత్రలే దొరికేవి. అందుకే శంకర్ ఇచ్చిన ఆఫర్‌ని రిజెక్ట్ చేశాను. అయితే నేను రిజెక్ట్ చేసిన అనంతరం మీడియాలో చాలా రూమర్లు వచ్చాయి. కానీ అవేవి నిజం కాదు. అంటూ సత్యరాజ్ చెప్పుకోచ్చాడు. దాదాపు 38 ఏళ్ల తర్వాత రజనీ, సత్యరాజ్ కలిసి ‘కూలీ’ సినిమాలో నటించారు. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించగా.. ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.