కార్తీ, అరవింద్ స్వామి ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సత్యం సుందరం’. ‘96’ఫేం సి.ప్రేమ్‌కుమార్ దర్శకుడు. సూర్య, జ్యోతిక నిర్మాతలు. ఏషియన్ సురేశ్ ఎంటైర్టెన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ కార్తీ, అరవింద్‌స్వామికి సంబంధించిన రెండు ప్రపంచాలను పరిచయం చేసింది. వారిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ హైలైట్‌గా టీజర్ సాగింది. ఇందులో కార్తీ అమాయకత్వంతో కూడి పాత్ర చేస్తే, అరవింద్‌స్వామి రిజర్వ్డ్, అర్బన్ పర్సనాలిటీగా కనిపించారు. శ్రీదివ్య, స్వాతి కొండే, దేవదర్శిని ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: మహేందిరన్ జయరాజు, సంగీతం: గోవింద్ వసంత, నిర్మాణం: 2డీ ఎంటర్టైన్మెంట్.