గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 00:17:11

‘సర్కారు వారి పాట’ మొదలైంది

‘సర్కారు వారి పాట’ మొదలైంది

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్‌ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి మహేష్‌బాబు తనయ సితార క్లాప్‌నివ్వగా, ఆయన సతీమణి నమ్రత కెమెరా స్విఛాన్‌ చేశారు. జనవరి మొదటివారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. బ్యాంకు రుణాల ఎగవేత నేపథ్యంలో చోటుచేసుకునే ఆర్థిక నేరాలు..రైతుల తాలూకు కష్టాల్ని కథావస్తువుగా తీసుకొని బలమైన సామాజిక సందేశం, శక్తివంతమైన యాక్షన్‌ అంశాల కలబోతగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మధి, ఎడిటర్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌, ఆర్ట్‌: ఏఎస్‌ ప్రకాష్‌, సంగీతం: తమన్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: రాజ్‌కుమార్‌, నిర్మాతలు: నవీన్‌  ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, రామ్‌ ఆచంట, గోపి ఆచంట, రచన-దర్శకత్వం: పరశురామ్‌ పెట్ల.