Sarkaru vaari paata Pre-Release Event | మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండున్నరేళ్ళు దాటింది. ఈయన నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈయన నటించిన లెటెస్ట్ చిత్రం సర్కారు వారి పాట. పరుశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లు జోరుగా జరుపుతుంది. ఈ చిత్రానికి పనిచేసిన క్రూ మెంబర్స్ ప్రమోషన్లలో పాల్గొంటూ, ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్న ప్రీ రిలీజ్ వేడుక తేదీని మేకర్స్ తాజాగా వెల్లడించారు.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో మే 7న జరుపనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే ఈ వేడుకకి స్టార్ డెరెక్టర్ పూరీ రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. బ్యాంకింగ్ స్కామ్‌ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ రెట్టింపు అంచనాలను నమోదు చేసింది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ సంస్థలతో కలిసి మహేష్‌బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.
Its time for celebrations 🤘
All the Super fans assemble at the police grounds on May 7th for the Grand #SVPPreReleaseEvent 💥💥#SarkaruVaariPaata#SVPOnMay12
Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @14ReelsPlus @GMBents @MythriOfficial pic.twitter.com/IZTteEwesf
— SarkaruVaariPaata (@SVPTheFilm) May 5, 2022