తెలంగాణ నేపథ్యంలో సామాజికాంశాల్ని చర్చిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సర్కారు బాయి’. శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా నటిస్తున్నారు. లారా దర్శకుడు. తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘చరిత్రలో మరుగున పడిపోయిన ఓ కథను తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం.
1985లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కులవివక్ష, సామాజిక అసమానతలు, అణగారిన వర్గాలపై అన్యాయాల గురించి చర్చించబోతున్నాం’ అన్నారు. సమాజానికి సందేశాన్నందించే చిత్రమిదని నిర్మాత తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి పేర్కొన్నారు. బాహుబలి ప్రభాకర్, వివ రెడ్డి, నాగ మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కె.శివా, దర్శకుడు: లారా.