Saripodhaa Sanivaaram | హీరో నాని నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
నేడు ‘క్రోధి’ నామ సంవత్సరం సందర్భంగా మేకర్స్ ‘ఉగాది’ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్లో నానితో పాటు సాయికుమార్ కనిపిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అంటే సుందరానికి’ (Ante Sundharaniki) సినిమా తర్వాత నాని – వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
The HAPPY SMILES
we all manifest on this special day ❤️Surya & Shankaram
Tharupuna Andariki Ugadi Subhakankshalu 🙂 🤗#HappyUgadi 🎋#SaripodhaaSanivaaram#SuryasSaturdayNatural 🌟 @NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe @muraligdop @karthikaSriniva… pic.twitter.com/CVymdezwOJ
— BA Raju’s Team (@baraju_SuperHit) April 9, 2024