Saripodhaa Sanivaaram | ఇప్పుడున్న తెలుగు నటులలో మినిమం గ్యారెంటీ హీరో అంటే టక్కున గుర్తుకు వచ్చే నటుడు నాని. కథ ఎలా ఉన్నా సినిమా ఎలా తీసినా ప్రేక్షకులు మాత్రం అతడి సినిమాలకు క్యూ కడతారు. ఇక నాని కూడా స్టార్ దర్శకుల వెంట పడకుండా కొత్త దర్శకులకు ఛాన్స్‌లు ఇస్తూ.. సూపర్ హిట్లు అందుకుంటున్నాడు.
అయితే నాని కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా.. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. తమిళ నటుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నై వెళ్లాడు నాని. అయితే చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఒక అభిమాని వచ్చి నాని ఆటోగ్రాఫ్ అడిగాడు. నాని తనకు ఆటోగ్రాప్ ఇవ్వగా తన టీషర్ట్‌పై కూడా ఆటోగ్రాప్ ఇవ్వమని కోరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ‘అంటే సుందరానికి’ (Ante Sundharaniki) సినిమా తర్వాత నాని – వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఎస్జే సూర్య ఓ క్రూరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది.
#Nani and his fanfare in Chennai.
Team #SaripodhaaSanivaaram arrives for promotions. pic.twitter.com/V4iGuW25um
— Gulte (@GulteOfficial) August 17, 2024
As always Surya is on BUSINESS on Saturday 😉
The team has arrived in Chennai and the press meet will kick off shortly ❤️#SaripodhaaSanivaaram#SuryasSaturday#PotharuMothamPotharu pic.twitter.com/XpCsFE9wiE
— DVV Entertainment (@DVVMovies) August 17, 2024