Saripodhaa Sanivaaram | గతేడాది హయ్ నాన్న, దసరా సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని తాజాగా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దసరా సినిమాతో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తాజాగా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)సినిమాతో రెండో సారి రూ.100 కోట్ల క్లబ్లో చేరాడు. నాని 31గా వచ్చిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా.. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కించింది. ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతు ఫస్ట్ రోజే రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయినట్లు చిత్రబృందం తెలిపింది. ఒకవైపు తమిళం నుంచి విజయ్ గోట్ సినిమాతో పాటు తెలుగులో మత్తు వదలరా 2 పోటి ఇచ్చిన తట్టుకుని నిలబడి ఈ కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సూర్య (Nani)కి చిన్నప్పటి నుంచి విపరీతమైన కోపం. తన కోపం కారణంగా రోజూ గొడవలే. సూర్య కోపం తగ్గించడానికి తల్లి ఓ ప్రామిస్ తీసుకుంటుంది. ‘వారంలో శనివారం మాత్రమే కోపం చూపించాలి. మిగిలిన రోజులు సైలెంట్ గా వుండాలి’ ఇదీ ఆ ప్రామిస్. దీని ప్రకారం కేవలం శనివారం రోజే తన కోపాన్ని చూపిస్తుంటాడు సూర్య. తనకి కోపం తెప్పించిన వారి పేరుని చిత్రగుప్తుడిలా ఓ డైరీలో రాసి, శనివారం యముడిలా దండిస్తాడు. కట్ చేస్తే.. దయానంద్ (SJ Surya) జాలి కనికరం లేని పోలీస్ ఇన్స్పెక్టర్. తన అన్నయ్య కూర్మానంద్ (Murali Sharma)తో తనకు ఆస్తి గొడవలు వుంటాయి. ఎలాగైనా అన్నయ్య ఆస్తిని చేజిక్కించుకోవాలని చూస్తుంటాడు. తన కోపాన్ని సోకులపాలెం అనే ఊరి వాళ్ల మీద చూపిస్తుంటాడు. కోపం వచ్చినప్పుడల్లా ఆ ఊరిలో ఎవరినో ఒకరిని పట్టుకొని తప్పుడు కేసులు బనాయించి దారుణంగా కొడుతుంటాడు. అలాంటి దయ పేరుని సూర్య తన డైరీలో రాసుకుంటాడు. తర్వాత ఏం జరిగింది? దయ పేరు సూర్య డైరీలోకి ఎందుకు వచ్చింది. దయ, సోకులపాలెం జనాలనే ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ కథలో పోలీస్ కానిస్టేబుల్ చారులత (Priyanka Mohan) పాత్ర ఏమిటి? ఇవన్నీ తెరపై చూడాలి.
#SaripodhaaSanivaaram 100 Crore + Counting 🔥🔥♥️♥️💯💯🏆🏆@NameisNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JXBE pic.twitter.com/6kqzRf2cBX
— BA Raju’s Team (@baraju_SuperHit) September 15, 2024