ఆరాధ్యదేవి, సత్య యాదు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శారీ’. గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవిశంకర్ వర్మ నిర్మించారు. నేడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. రెండు పాత్రలు ప్రధానంగా సాగే ఇంటెన్స్ డ్రామా ఇదని, రామ్‌గోపాల్‌వర్మ సహకారంతో అనుకున్న విధంగా సినిమాను పూర్తి చేశామని చెప్పారు.
సోషల్‌మీడియాను విపరీతంగా ఉపయోగించడం వల్ల ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురువుతాయనే పాయింట్ మీద ఈ సినిమా తీశామని, మూలకథను తానే అందించానని రామ్‌గోపాల్‌వర్మ తెలిపారు. తనకిది డ్రీమ్ ప్రాజెక్ట్ అని కథానాయిక ఆరాధ్యదేవి తెలిపింది. తక్కువ పాత్రలు ఉన్నా. కథ, కథనాలు ఎఫెక్టివ్‌గా ఉంటాయని హీరో సత్య యాదు చెప్పారు.