బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 19 మంది కంటెస్టెంట్స్‌తో సెప్టెంబర్ 5న ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి వారం హౌజ్ గొడవలతో హీటెక్కిపోయింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, కన్నీళ్లు పెట్టుకోవడం నానా హంగామా సృష్టించడం జరిగింది. గత ఆదివారం ఈ షో మొదలు కాగా, నేటితో షో మొదలై వారం అవుతుంది. అయితే ఈ వారం హౌజ్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్న విషయం తెలిసిందే.
ఈ వారం నామినేషన్లో రవి, హమీదా, మానస్, కాజల్, సరయూ, జెస్సీ ఉండగా వీరిలో ఒకరు హౌజ్ నుండి బయటకు పోవడం పక్కా. ఇప్పటికే ఆరుగురిలో రవి, హమీదా సేవ్ కాగా నలుగురు ఉన్నారు. ముందు అంతా జెస్సీ బయటకు వెళతాడని అన్నారు. కాని సింపతీతోనే లేదంటే రానున్న రోజులలో గేమ్‌పై పట్టు సారిస్తాడనే నమ్మకం వల్లనో ఏమో కాని అతనికి ఓట్లు బాగానే వేశారు.
ఈ వారం హాట్ బ్యూటీ సరయు బయటకు వెళ్లనుందని జోరుగా వార్తలు వస్తున్నాయి. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ తో బూతు పురాణం నడిపించిన సరయు హౌజ్‌లో మాములుగానే మాట్లాడుతూ వచ్చింది. కాని ఆమె ప్రవర్తన ప్రేక్షకులకి నచ్చకపోవడంతో ఈ వారం ఆమెని ఎలిమినేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. కెప్టెన్సీ టాస్క్ లో ఆర్జే కాజల్ తో కాసేపు వాగ్వాదం నడిచింది.ఆ తర్వాత సిరితో కూడా గొడవ పడింది. ఈ క్రమంలోనే సరయు హౌజ్‌ని వీడనుందా అనేది తెలియాల్సి ఉంది.