శరవణన్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది లెజెండ్’. జెడీ-జెర్రీ దర్శకత్వం వహిస్తున్నారు. లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ పతాకంపై శరవణన్ నిర్మిస్తున్నారు. ఊర్వశి రౌటేలా కథానాయిక. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది.
శ్రీలక్ష్మీ మూవీస్ పతాకంపై ఎన్వీ ప్రసాద్ ఉభయ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు. శనివారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీప్రసాద్ మాట్లాడుతూ ‘శరవణన్ స్టోర్ తమిళనాడులో మంచి బ్రాండ్‌గా పేరు పొందింది. వినూత్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు. ప్రేక్షకులను అలరించే అన్ని కమర్షియల్ హంగులున్న చిత్రమిది’ అని అన్నారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్ని అంశాలు కలబోసిన చిత్రమిదని, శరవరణ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుందని దర్శకులు తెలిపారు.
ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉందని కథానాయిక ఊర్వశి రౌటేలా తెలిపింది. ఈ సినిమాలో ప్రత్యేకగీతంలో నర్తించానని, జానపద శైలిలో ఆ పాట అలరిస్తుందని లక్ష్మీరాయ్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.