Sarangapani Jathakam | ఇటీవలి కాలంలో కామెడీ చిత్రాలకి ప్రేకకుల ఆదరణ మాములుగా లేదు. కామెడీ నేపథ్యంలో ఏ సినిమా వచ్చిన అది సూపర్ హిట్ అవుతుంది. అందుకే మేకర్స్ కూడా ఎక్కువగా కామెడీ చిత్రాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో ‘సారంగపాణి జాతకం’ అనే జాతకం తెరకెక్కుతుంది. సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఎంతో ఇష్టపడి నిర్మించిన వినోదాత్మక చిత్రం ఇది కాగా, ఇందులో ఫ్యామిలీ మొత్తాన్ని కడుపుబ్బా నవ్వించడంతో పాటు యూత్‌ని ఆకట్టుకునే క్రైమ్ కామెడీ అంశాలు ఎక్కువగా ఉంటాయని అర్ధమవుతుంది.
సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఇది తెగ కామెడీ పంచుతుంది. ఓ వైపు తన నమ్మకాలు, మరోవైపు ఇష్టపడిన అమ్మాయి మధ్య నలిగిపోయే యువకుడి కథతో ఈ సినిమా రూపొందుతున్నట్టు సినిమా ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ప్రియదర్శితో పాటు వెన్నెల కిషోర్, వైవా హర్షల కామెడీ ఆకట్టుకునేలా ఉంది. చూస్తుంటే ఈ సినిమా మంచి హిట్ అయ్యేలా కనిపిస్తుంది.
ముందుగా ఈ నెల 18నే చిత్రాన్ని రిలీజ్ అనుకున్నప్పటికీ.. బయ్యర్ల కోరిక మేరకు.. మరిన్ని థియేటర్ల సౌలభ్యత కోసం వారం రోజులు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అని తెలిపారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీయాలనే నా కోరిక ‘సారంగపాణి జాతకం’తో నెరవేరింది. మా శ్రీదేవి మూవీస్ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టే సినిమా అవుతుంది. ఫస్ట్ కాపీతో సహా సినిమా రెడీ అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. అని నిర్మాత తెలియజేశారు. ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ తదితరులు నటించారు.