Sarangapani Jathakam | టాలీవుడ్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, బలగం, కోర్టు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి కాంబోలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘సారంగపాణి జాతకం’ అంటూ ఈ సినిమా రాబోతుండగా.. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మన్, ‘సమ్మోహనం, చిత్రాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విడుదల తేదీని కూడా వాయిదా వేసింది టీమ్. దీంతో కొత్తగా మరో విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది.
ఈ చిత్రంలో రూప కొడువాయూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వి.కె. నరేష్. తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూపలక్ష్మి, హర్షిణి , కె.యల్.కె. మణి కీలక పాత్రలలో నటిస్తున్నారు.
అన్ని వయసుల వారిని అలరించే అచ్చమైన తెలుగు చిత్రం #SarangapaniJathakam ఏప్రిల్ 25 న విడుదల ✨
A Hilarious Summer Treat Guaranteed in theaters 🤩#SPJOnApril25th ✋🏻🔍#MohanaKrishnaIndraganti @PriyadarshiPN @RoopaKoduvayur @pgvinda #MarthandKVenkatesh #VivekSagar @krishnasivalenk… pic.twitter.com/xEcTY9H1yv
— Sridevi Movies (@SrideviMovieOff) April 12, 2025